Nellore: నెల్లూరులో గౌతు లచ్చన్న విగ్రహ ఏర్పాటుకు విన్నపం

Nellore: నెల్లూరు జిల్లా గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.

V. Narasimhulu, Nellore
Published on: 9 May 2026 10:08 AM IST
Nellore
X

Nellore: నెల్లూరులో గౌతు లచ్చన్న విగ్రహ ఏర్పాటుకు విన్నపం

నెల్లూరు: నెల్లూరు జిల్లా గౌడ సంఘం నూతన అధ్యక్ష , కార్యదర్శులుగా ఎన్నికైన తిరకల శ్రీనివాసుల గౌడ్ టీడీపీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్రను నెల్లూరు నగరం, మాగుంట లేఅవుట్ లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గౌడ నేతలు బీద రవిచంద్రకు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించారు.

గౌడ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారు బీదకు వివరించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష , కార్యదర్శులను, కమిటీ సభ్యులను బీద అభినందించారు, అనంతరం శాలువాతో వారిని సన్మానించారు. నెల్లూరు నగరంలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ను ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని బీద రవిచంద్ర ను గౌడ నేతలు కోరారు, వారి వినతిపై బీద సానుకూలంగా స్పందించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story