Nellore: నెల్లూరు జిల్లాలో రెండో రోజు నామినేషన్ల జోరు

Nellore: నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రెండో రోజు నెల్లూరు మేయర్ పదవికి 5, వార్డులకు 119తో పాటు బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరులో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 17 Oct 2026 9:26 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు జిల్లాలో రెండో రోజు నామినేషన్ల జోరు

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శనివారం రెండో రోజు వివిధ మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి 5 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డులకు సంబంధించి 119 నామినేషన్లు దాఖలయ్యాయి.

బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక నామినేషన్ దాఖలు చేయగా, వార్డులకు 28 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆత్మకూరు మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ స్థానానికి వైయస్ఆర్సీపీ నుంచి ఒక నామినేషన్ దాఖలు కాగా, వార్డులకు సంబంధించి 41 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE