Nellore: నెల్లూరు జిల్లాలో రోడ్లపై ధాన్యం ఆరబోతపై పోలీసుల హెచ్చరిక!
Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలంలో రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఎస్సై భోజ్యా నాయక్ సూచించారు.
Nellore: నెల్లూరు జిల్లాలో రోడ్లపై ధాన్యం ఆరబోతపై పోలీసుల హెచ్చరిక!
Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలంలో రహదారులపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, రైతులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సంగం ఎస్సై భోజ్యా నాయక్ సూచించారు.వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో పలువురు రైతులు పంటను రహదారులపై ఆరబెడుతున్నారని, అలాగే కోత మిషన్ల వల్ల రోడ్లపై బురద చేరుతోందని అన్నారు.
రోడ్డుపై ధాన్యం, బురద ఉంటే వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా రాత్రివేళ ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు.వాహనదారుల భద్రత రైతుల బాధ్యత కూడా అని గుర్తుచేశారు. ధాన్యాన్ని రోడ్లపై పోయకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో ఆరబెట్టుకోవాలని, కోత మిషన్ల తర్వాత రోడ్డుపై పేరుకుపోయిన బురదను వెంటనే శుభ్రం చేయాలని సూచించారు. రహదారిని ప్రమాదకరంగా మార్చవద్దని, పోలీసులకు సహకరించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.




