Nellore: వింజమూరు జడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి గెలుపు!
Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు జడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి టీడీపీ ప్రత్యర్థిపై 2,944 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
Nellore: వింజమూరు జడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి గెలుపు!
నెల్లూరు: వింజమూరు మండల జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించింది. వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గణపం సుదర్శన్ రెడ్డిపై 2,944 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో పల్లాల కొండారెడ్డి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.ఆయన విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. భారీ మెజార్టీతో సాధించిన ఈ విజయం మండల రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.




