Nellore: నెల్లూరులో వైద్యాధికారులతో డీఎంహెచ్‌వో డాక్టర్ వి. సుజాత సమీక్ష!
Nellore: నెల్లూరులో నెల్లూరు, కావలి డివిజన్ల వైద్యాధికారులతో డీఎంహెచ్‌వో డాక్టర్ వి. సుజాత సమీక్ష నిర్వహించారు.
Nellore: నెల్లూరులో వైద్యాధికారులతో డీఎంహెచ్‌వో డాక్టర్ వి. సుజాత సమీక్ష!
నెల్లూరు: ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కార్యాలయంలో నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ వి సుజాత మరియు నెల్లూరు జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ ఎస్కే ఖాదర్ వల్లి అధ్యక్షతన కావలి మరియు నెల్లూరు డివిజన్ వైద్యాధికారులకు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమీక్షా సమావేశంలో నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మాట్లాడుతూ.... వైద్యాధికారులు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అమలవుతున్న ప్రోగ్రామ్స్ ను 100% ప్రజలకు చేరువయ్యేలా చేయాలని అంతేకాకుండా ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే లెప్రసీ కేస్ డిడక్షన్ క్యాంపైని నెల్లూరు జిల్లాలో విజయవంతంగా పూర్తి చేయాలని ఎవరికైతే స్పర్శ లేని రాగి వర్ణపు మచ్చలు శరీరం పైన ఉంటాయో మరియు ఎవరికైతే రెండు వారాలకు మించి దగ్గు ,జ్వరం ,ఆకలి లేకపోవడం, ఆకస్మికంగా బరువు తగ్గించడం, సాయంత్రం పూట జ్వరం రావడం, మధుమేహ వ్యాధిగ్రస్తులు అలాంటి వారందరినీ గుర్తించి దగ్గరలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా లెప్రసి ఎయిడ్స్ మరియు టీబీఅధికారి డాక్టర్ ఎస్ కే ఖాదరవల్లి , డిస్టిక్ న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్, డిస్టిక్ ఉమెనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ బ్రిజిత , డిపిఎమ్ఓ ఆఫీసర్ డాక్టర్ సునీల్ , మరియు వివిధ రకాల ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.




