Nellore: రాజుపాలెం వెంకటేశ్వర స్వామివారికి దాతల ఆభరణాల బహూకరణ
Nellore: నెల్లూరు జిల్లా రాజుపాలెం వెంకటేశ్వర స్వామివారికి రూపుదిద్దుకున్న నూతన ఆభరణాల బహూకరణ. సర్వాంగ సుందరంగా స్వామివారి దర్శనం, భక్తుల ప్రత్యేక పూజలు.
Nellore: రాజుపాలెం వెంకటేశ్వర స్వామివారికి దాతల ఆభరణాల బహూకరణ
నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని రాజుపాలెం గ్రామంలో వెలసివున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దాతలు ప్రత్యేక అలంకరణ సామగ్రిని భక్తిశ్రద్ధలతో బహూకరించారు.స్వామివారి అలంకరణ కోసం మకరతోరణం,కిరీటం,వక్షస్థల కవచం,హస్తాలు,పాదాలు తదితర ఆభరణాలను సమర్పించారు.
మకరతోరణాన్ని హరిహరపు వెంకటేశ్వర్లు,నారాయణమ్మ దంపతులు బహూకరించగా,కిరీటం,వక్షస్థలం,హస్తాలు,పాదాలు తదితర అలంకరణ సామగ్రిని బిల్లు పాటి రామయ్య,రాధమ్మ దంపతులు సమర్పించారు.ఈ సందర్భంగా దాతలు సమర్పించిన నూతన అలంకరణ సామగ్రితో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.
దేవస్థాన ప్రధాన అర్చకులు మురళీకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో వివిధ రకాల అభిషేకాలు,అర్చనలు,హారతులు,ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.నూతన అలంకరణ సామగ్రితో స్వామివారు సర్వాంగ సుందరంగా దర్శనమివ్వడంతో భక్తులు ఎంతో ఆనంద పరవశులయ్యారు.
పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.స్వామివారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా వారు తెలియచేశారు.




