Nellore: 64, 61 డివిజన్లలో డాక్టర్ సింధూర జోరుగా ఎన్నికల ప్రచారం!

Nellore: నెల్లూరు 64, 61 డివిజన్లలో డాక్టర్ సింధూర ప్రచారం. నారాయణ నేతృత్వంలో జరిగిన అభివృద్ధే శ్రీరామరక్ష అని కూటమి అభ్యర్థులకు ఓట్ల విజ్ఞప్తి.

Venkata Thirumala
Published on: 24 Oct 2026 9:55 PM IST
Nellore
X

Nellore: 64, 61 డివిజన్లలో డాక్టర్ సింధూర జోరుగా ఎన్నికల ప్రచారం!

నెల్లూరు: 64, 61 డివిజన్ల పరిధిలో తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు. భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు ప్రజలతో మమేకమై మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యాపారస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.

ఈ సందర్భంగా డాక్టర్ సింధూరకు స్థానికులు కార్యకర్తలు పూల వర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. కేవలం రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో కనివిని ఎరుగని రీతిలో నెల్లూరు నగరం సుందరంగా తీర్చిదిద్దారన్నారు.

చిన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు ప్రజల కష్టాలు తెలుసునని వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తూ మంత్రి నారాయణ ప్రజల మనిషిగా నిలిచారన్నారు.

నారాయణ అంటే అభివృద్ధి... అభివృద్ధి అంటే నారాయణ అన్నంతగా ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నారన్నారు.టీడీపీ 64 వ డివిజన్ అభ్యర్థి షేక్ నజిమా, 61వ డివిజన్ అభ్యర్థి రంగమయూర్ రెడ్డి, అలాగే మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ లను మంచి మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లు ను కోరారు.

Venkata Thirumala

Venkata Thirumala