Nellore: నెల్లూరు జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల!

Nellore: నెల్లూరు జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 1 Aug 2026 7:50 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల!

Nellore: "నెల్లూరు జిల్లా ఓటర్ల ముసాయిదాకు సర్వం సన్నద్ధం- జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా"

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)–2026 కార్యక్రమంలో భాగంగా 31-07-2026 ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి విజయకుమార్ తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ముసాయిదా జాబితా ప్రచురణ ఏర్పాట్లను వివరించారు.

జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 2,460 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 16,84,056 మంది ఓటర్లు ముసాయిదా జాబితాలో ఉన్నారని తెలిపారు. ఇందులో పురుషులు 8,25,349 మంది, మహిళలు 8,58,545 మంది, ఇతరులు 162 మంది ఉన్నారని వెల్లడించారు.

జూలై 31 నుంచి ఓటర్ల జాబితాపై ఫారం-6, 6ఏ, 7, 8 ద్వారా కొత్తగా పేరు నమోదు, మార్పులు, తొలగింపులు, చిరునామా సవరణలు, EPIC వివరాల సవరణ వంటి అభ్యర్థనలను స్వీకరిస్తామని తెలిపారు. దరఖాస్తులను సంబంధిత ERO/AERO కార్యాలయాల్లో లేదా https://voters.eci.gov.in⁠ వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు.

ఓటరు జాబితాకు సంబంధించిన అభ్యంతరాలపై RP Act–1950 నిబంధనల ప్రకారం అప్పీల్ అవకాశం కూడా ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచూసుకొని అవసరమైన మార్పులు చేసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story