Nellore: నెల్లూరులో ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడులు

Nellore: నెల్లూరు నగరంలో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

V. Narasimhulu, Nellore
Published on: 18 Jun 2026 10:22 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడులు

Nellore: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశములు మేరకు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్, నెల్లూరు-1 వారు నెల్లూరు నగరములో ఉదయం నుండి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నెల్లూరు నగరం లోని ఇరుగాలమ్మ సంఘం వద్ద అక్రమముగా మద్యం సీసాలు అమ్ముతున్న M. వంశీ కృష్ణ అను వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి (08),

180 పరిమాణము గల మద్యం సీసాలను స్వాదీనము చేసుకొని అతని పై కేసు నమోదు చేయడము జరిగినది. మరియు ఈ ప్రత్యేక డ్రైవ్ నందు, బహిరంగముగా మద్యపానం సేవించుచున్న (2) మగ వ్యక్తులను అరెస్టు చేసి, వారి పై కేసులు నమోదు చేయడము జరిగినది. ఈ కేసులో పాల్గొన్న P&ESI- JKVN మురళి కృష్ణ మరియు కానిస్టేబుల్ S. సుధాకర్, SK.అజీజ్ బాష లను పై అధికారులు అభినందించినారు.

మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సాయంత్రం నుండి నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ నందు ఇరుగాలమ్మ గుడి బస్టాండ్ వద్ద అక్రమముగా మద్యం సీసాలు అమ్ముతున్న S. సురేష్ యాదవ్ అను వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి (07) 180 పరిమాణము గల మద్యం సీసాలను స్వాదీనము చేసుకొని అతని పై కేసు నమోదు చేయడము జరిగినది.ఈ కేసులో పాల్గొన్న వారిని అధికారులు అభినందించినారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story