Nellore: రైతులపై ఈఈ దురుసు ప్రవర్తన సంగం మండలంలో 200 ఎకరాలు నీట మునక!
Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు వద్ద బెజవాడపాపిరెడ్డి కాలువ ఉధృతికి 200 ఎకరాల పంట నష్టం. ప్రశ్నించిన రైతులపై ఈఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు దబాయింపు.
Nellore: రైతులపై ఈఈ దురుసు ప్రవర్తన సంగం మండలంలో 200 ఎకరాలు నీట మునక!
Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు వద్ద బెజవాడపాపిరెడ్డి కాలువ నీటి నియంత్రణ లోపించడంతో, సుమారు రెండు వందల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. చేతికందే సమయంలో పంట నష్టపోతున్నామని కన్నీరుమున్నీరవుతున్న బాధితులు.. పరిస్థితిని వివరించేందుకు ఈఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు కారును అడ్డుకున్నారు.
అయితే సదరు అధికారి కనీసం కారు దిగేందుకు కూడా ఇష్టపడకుండా.. "దిగువ ఆయకట్టుకు నీరు అవసరం, ఇలాగే వదులుతాం" అంటూ సమాధానమిచ్చారు. రైతులు తమ బాధను మొరపెట్టుకుంటున్నా వినకుండా.. కారులో నుంచే "మీ పేర్లు ఏమిటి?" అంటూ దబాయించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించకుండా, రైతులపైనే దురుసుగా వ్యవహరించిన ఈ అధికారిపై ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.




