Nellore: నెల్లూరు ఎన్టీఆర్ విగ్రహ శంకుస్థాపన నెక్లెస్ రోడ్డు అభివృద్ధి
Nellore: నెల్లూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. హైదరాబాద్ తరహాలో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును తీర్చిదిద్దుతామన్నారు.
Nellore: నెల్లూరు ఎన్టీఆర్ విగ్రహ శంకుస్థాపన నెక్లెస్ రోడ్డు అభివృద్ధి
నెల్లూరు: నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేశారు నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి...
ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు తరహాలో చేస్తామని చెప్పారు నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏది చెబితే దానిని నుడా చైర్మన్ గా తాను చేస్తానని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు మరియు గణేష్ ఘాట్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గణేష్ ఘాట్ వద్ద ఆర్చిల నిర్మాణానికి నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సహకారంతో అతిత్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, క్లస్టర్ ఇంచార్జులు, కో క్లస్టర్ ఇంచార్జులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.




