Nellore: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్‌కు ఉచిత వైద్య శిబిరం

Nellore: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు.

A Praveen, Nellore
Published on: 6 Sept 2026 3:26 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్‌కు ఉచిత వైద్య శిబిరం

Nellore: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాకర్స్ పాల్గొని బీపీ మరియు షుగర్ పరీక్షల తోపాటు లంగ్స్ కెపాసిటీ తెలుసుకుందుకు PFT టెస్ట్ లు నిర్వహించడంజరిగింది.

సుమారు 300 మంది వాకర్స్ పాల్గొని విశేష స్పందన తెలియచేసారు. కిమ్స్ హాస్పిటల్ నుండి dr.శశి భారత కుమార్ రెడ్డి మరియు dr.అవినాష్ రావు విచ్చేసి ఊపిరి తిత్తుల సమస్యలపై అవగాహన కలిగించారు.

ఈ కార్యక్రమం లో ప్రసిడెంట్ స్నేహ సురేష్, తిరుపతి శేఖర్, వేలూరు రంగారావు, మెంటా రామారావు, అరిగల సాయిరాం, అనంత రామారావు, గాలి రఘురామ నాయుడు, కనకట్ల రఘురామ్ ముదిరాజ్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story