Nellore: నెల్లూరు రామ్మూర్తినగర్లో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం
Nellore: నెల్లూరు రామ్మూర్తినగర్ కల్యాణ మండపంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం; 123 జంటల భాగస్వామ్యం, స్పటిక లింగ అభిషేకం, అన్నదాన కార్యక్రమం.
Nellore: నెల్లూరు రామ్మూర్తినగర్లో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం
నెల్లూరు: నెల్లూరు లోని రామ్మూర్తి నగర్ రామచంద్రయ్య కల్యాణ మండపంలో వైభవంగా శ్రీ వీర వెంకట సత్య నారాయణ స్వామి వ్రతం జరిగింది.ఈ కార్యక్రమం శ్రీ శివ సత్య సంకల్ప ట్రస్ట్ కంచర్ల భాస్కర్ సహకారంతో అఫినిటీ ప్రాపర్టీస్ అధినేత మాలేపాటి చైతన్య,పద్మజ దంపతులు నిర్వహించారు.
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది.ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.వేదపండితులు మరియు అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు,అలంకరణలు మరియు షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం దంపతులు పీటలపై కూర్చుని భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రత కథను ఆలకించి, వ్రత ఆచారాన్ని పూర్తి చేశారు.
ఈ సందర్భంగా అఫినిటీ ప్రాపర్టీస్ కార్యాలయం దగ్గరలోని కల్యాణ మండలంలో భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది.శ్రీ వీర వెంకట సత్య నారాయణ స్వామి వ్రతం లో 123 మంది జంటలు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు.భక్తులు కార్తిక మాస పౌర్ణమి సందర్భంగా స్పటిక లింగ అభిషేక పూజలు నిర్వహించారు. వ్రతం అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాద వితరణ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆస్సీసులతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రఘునాథ్ రాజు,డివిజన్ ఇంచార్జ్ సుజన్ కుమార్,51 వ డివిజన్ కార్పొరేటర్ బెజవాడ మెగనాథ్ సింగ్ గారి సతీమణి,వెంకయ్య స్వామి అన్నదాన ట్రస్ట్ మెంబర్ ఉదయ్ శ్రీధర్, స్థానిక ప్రముఖులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.




