Nellore: గ్రావెల్ మాఫియా దౌర్జన్యం.. రాజ్ న్యూస్ రిపోర్టర్‌పై దాడి!
Nellore: నెల్లూరుపాలెంలో అక్రమ గ్రావెల్ తరలింపును చిత్రీకరిస్తున్న రాజ్ న్యూస్ రిపోర్టర్ సురేష్ బాబుపై మాఫియా దాడి చేసింది. జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు.
Nellore: గ్రావెల్ మాఫియా దౌర్జన్యం.. రాజ్ న్యూస్ రిపోర్టర్‌పై దాడి!
నెల్లూరు జిల్లా: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు పాలెంలో గ్రావెల్ మాఫియా మీడియాపై దాడికి తెగబడ్డ సంఘటన చోటు చేసుకుంది.
నెల్లూరు పాలెం నుండి అక్రమంగా సుమారు 30 ట్రాక్టర్లు తో మట్టి తరలిస్తున్న మాఫియాను స్థానికులు అడ్డుకొని మీడియా సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న మీడియా సంఘటన స్థలానికి చేరుకొని వీడియో చిత్రీకరణ చేస్తుండగా ఒక్కసారిగా గ్రావెల్ మాఫియా మీడియాపై వాగ్వాదానికి దిగింది.
ఎంత సర్ది చెప్పినా వినిపించుకోకుండా రాజ్ న్యూస్ రిపోర్టర్ రామాపురం సురేష్ బాబు చిత్రీకరిస్తున్న సెల్ ఫోన్ ను లాక్కొని అసభ్య పదజాలాలతో దూషిస్తూ మాదాల హరి నాయుడు, మాదాల హరీష్ నాయుడు అనే ఇద్దరు గ్రావెల్ మాఫియా ప్రతినిధులు రాజ్ న్యూస్ రిపోర్టర్ సురేష్ బాబుపై దాడికి పాల్పడ్డారు.
సురేష్ బాబు తన సెల్ ఫోను బ్రతిమలాడి వారి వద్ద నుండి ఇప్పించుకొని మిగతా మీడియా మిత్రులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి పలువురు మీడియా సోదరులు చేరుకొని జరిగిన ఘటనపై ఆరా తీసి వెంటనే పోలీస్ స్టేషన్ కు చేరుకొని దాడికి పాల్పడ్డ వారిపై పట్టిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




