Nellore: ఒకే ప్రాంగణంలోకి జిల్లా బాలల సంరక్షణ సేవలు

Nellore: నెల్లూరు ఆసుపత్రి ఆవరణలో జిల్లా బాలల సంరక్షణ సేవల సమీకృత నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. హేనా సుజన్.

V. Narasimhulu, Nellore
Published on: 22 Aug 2026 10:07 PM IST
Nellore
X

Nellore: ఒకే ప్రాంగణంలోకి జిల్లా బాలల సంరక్షణ సేవలు

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బాలలకు సంబంధించిన అన్ని రకాల సంరక్షణ, రక్షణ, పునరావాసం, సంక్షేమ సేవలను ఒకే ప్రాంగణం నుంచి అందించేందుకు ఏర్పాటు చేసిన జిల్లా బాలల సంరక్షణ సేవల సమీకృత నూతన కార్యాలయ భవనాన్ని జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. హేనా సుజన్ శనివారం ఘనంగా ప్రారంభించారు.

మహిళా పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ నూతన భవనంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం (DCPU), చైల్డ్ హెల్ప్‌లైన్,(1098) చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC), డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (DPO) కార్యాలయం, సంబంధించిన ఇతర సేవల కార్యాలయాలను ఒకే ప్రాంగణంలోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. హేనా సుజన్ మాట్లాడుతూ,...

జిల్లాలోని బాలలకు సంబంధించిన వివిధ సేవల కోసం ప్రజలు వేర్వేరు కార్యాలయాలను సంప్రదించాల్సిన అవసరం లేకుండా, బాలల సంరక్షణకు సంబంధించిన అన్ని ప్రధాన సేవలు ఒకే ప్రాంగణంలో అందుబాటులో ఉండేలా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాలల రక్షణ, సంరక్షణ, పునరావాసం, సంక్షేమం తదితర అంశాలకు సంబంధించి అవసరమైన సహాయం కోసం ప్రజలు ఈ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ఏసీ నగర్‌లో కొనసాగుతున్న సంబంధిత కార్యాలయాలు, సేవలను ప్రస్తుతం మహిళా పోలీస్ స్టేషన్ సమీపంలోని నూతన ప్రాంగణానికి మార్చినట్లు తెలిపారు. ఒకే ప్రాంగణంలో అన్ని విభాగాలు పనిచేయడం వల్ల అధికారుల మధ్య సమన్వయం పెరగడంతో పాటు, బాలలకు మరియు వారి కుటుంబాలకు సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వేమారెడ్డి, సిఐ సుబ్బారావు, AHTU సిబ్బంది, శ్రీహరి, సతీష్, రాంబాబు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ సభ్యులు, శ్రీనివాసరావు, కె.రాజ్యలక్ష్మి, నిహారిక, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, హెచ్ ఫరూక్ భాషా, జిల్లా బాలల సంరక్షణ అధికారి బి. సురేష్, డీఎంసీ అనురాధ,ఐసీపీఎస్, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది , పిడి కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story