Nellore: బ్రాహ్మణపల్లిలో విద్యార్థులకు విద్యా పరికరాల పంపిణీ
Nellore: నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసిన ఐపీఎస్ పోలిచర్ల రమణయ్య. 80వ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న అధికారి.
Nellore: బ్రాహ్మణపల్లిలో విద్యార్థులకు విద్యా పరికరాల పంపిణీ
నెల్లూరు: నెల్లూరు జిల్లా కలువాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పోలిచర్ల రమణయ్య ఐపీఎస్,సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ నాక్రోటిక్స్ ,కోహిమా,నాగాలాండ్, వారి సొంత సౌజన్యంతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలబ్రాహ్మణపల్లి, మెయిన్ & బ్రాహ్మణపల్లి SC మరియు అంగన్వాడి సెంటర్ల నందు విద్యను అభ్యసిస్తున్న 85విద్యార్థిని విద్యార్థులకు మన భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు అవసరమైన విద్యా పరికరాలు అనగా నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్, స్పోర్ట్స్ కిట్స్, మరియు టీ షర్ట్స్, క్యాప్ (టోపీ) తదితర వస్తువులను విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి-2 ఎస్ జనార్ధన రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు అందరూ తమ గ్రామానికి చెందిన పోలిచర్ల రమణయ్య ఐపిఎస్ గారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులందరూ భవిష్యత్తులో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
పోలిచర్ల రమణయ్య మాట్లాడుతూ తన సొంత గ్రామంలో విద్యార్థులకు చదువు పట్ల అవసరమైన ఎలాంటి సహకారానికైనా ముందుంటానని అందుకు విద్యార్థులు అందరూ బాగా చదువులో రాణించి ఎదగాలని పిలుపునిచ్చారు, కార్యక్రమంలో పాఠశాల SMC చైర్మన్ రవీంద్ర, ప్రధానోపాధ్యాయులు శేషారెడ్డి, ప్రసన్నకుమార్, ఉపాధ్యాయులు అరుణమ్మ, ఉష, CRMT నాగేశ్వరరావు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




