Nellore: కోట ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేతపై ఐఎస్‌ఎఫ్ ఆందోళన

Nellore: నెల్లూరు జిల్లా కోటలో ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేసి 600 మంది విద్యార్థుల భవిష్యత్తును రోడ్డున పడేశారని ఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి.

V. Narasimhulu, Nellore
Published on: 4 Aug 2026 4:08 PM IST
Nellore
X

Nellore: కోట ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేతపై ఐఎస్‌ఎఫ్ ఆందోళన

నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎస్ సి గురుకుల పాఠశాల మూసివేయడంపై ఐఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో "చలో కలెక్టరేట్" కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ దాదాపు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో అకడమిక్ ఇయర్ ప్రారంభమై రెండు నెలల తర్వాత,

కనీసం తల్లిదండ్రులకు ముందస్తు ఇంటిమేషన్ కూడా లేకుండా.... గత నెల 19వ తేదీన పేరెంట్స్ ని పిలిపించి పోలీసుల సమక్షంలో.... రేపటినుండి మీ పిల్లలకు ఇక్కడ స్కూల్ ఉండదు అని చెప్పడం, మీరు ఏదైనా మాట్లాడినా, దౌర్జన్యం చేసినా, పోలీసులు చేత లాఠీ ఛార్జ్ చేయించి, కేసులు పెట్టిస్తామని బెదిరించి టీసీలు ఇచ్చి పంపించేసారని చెప్పారు.

ఇక్కడ ఈ స్కూల్ మూసివేసి ఐఐటి నీట్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెబుతున్న పెద్దలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల మాత్రమే కనిపించిందా.. జిల్లాలో మరే స్థలం లేదా అని ప్రశ్నించడం జరిగిందన్నారు. నిజానికి దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందని... ఇక్కడ ఉన్నటువంటి 10 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి, ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఐఐటీ నీట్ కళాశాలలకు తాము వ్యతిరేకం కాదని, జిల్లాలో ఎక్కడా స్థలం లేనట్లుగా ఇక్కడ ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలను ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా మూసివేసి, దాదాపు 600 మంది విద్యార్థులను రోడ్డు మీద నిలబెట్టడం ప్రభుత్వానికి ఏమాత్రం సరికాదని తక్షణమే మూసివేసిన గురుకుల పాఠశాలను రీ ఓపెన్ చేసి 600 మంది విద్యార్థులకు భవిష్యత్తును ఇవ్వాలని విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేశారు.

600 మంది విద్యార్థుల భవిష్యత్తు కు సంబంధించిన ఇంత దారుణమైన విషయం జరిగినప్పటికీ ప్రభుత్వంతో సహా, ప్రతిపక్ష పార్టీలు ఏ రాజకీయ పార్టీలు కూడా మాట్లాడకపోవడం చాలా దారుణమైన విషయం అన్నారు విద్యార్థి సంఘ నాయకులు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story