Nellore: నెల్లూరులో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా జనసేన జోరుగా ప్రచారం!

Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థుల విజయం కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.

V. Narasimhulu, Nellore
Published on: 14 Oct 2026 10:26 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా జనసేన జోరుగా ప్రచారం!

నెల్లూరు: గత నెల రోజులుగా నెల్లూరు నగరంలోని 21వ డివిజన్, (పాత 16వ డివిజన్) ప్రాంతంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు బుధవారం కూడా యథావిధిగా కొనసాగాయి. ఈ సందర్భంగా జనసేన నాయకులు, వీర మహిళలు ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుంటూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు.

ప్రచారంలో భాగంగా ప్రజలు తమ సమస్యలను, అభిప్రాయాలను నాయకులతో పంచుకున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు, పెన్షన్ల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాలపై పలువురు సానుకూలంగా స్పందించడం తమకు ఉత్సాహాన్ని ఇచ్చిందని నాయకులు తెలిపారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ కూటమి ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి ప్రతిబింబమని పేర్కొన్నారు.

ప్రతి గడపకు వెళ్లి ప్రజలతో మమేకమవుతూ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా జనసేన పార్టీ ప్రచారం కొనసాగుతుందని కిషోర్ గునుకుల, వీర మహిళ విజయలక్ష్మి గునుకుల స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ విజయలక్ష్మి గునుకులతో పాటు ఆమని, నాగేంద్ర బాలు, నరహరి, కృష్ణమోహన్ రెడ్డి,ప్రసన్న ,బాలాజీ, సుమంత్,రాజేష్, వీరమహిళలు ప్రవల్లిక,సుప్రియ,విజయ, ఆమని, శ్రీలక్ష్మి, కృష్ణవేణి, కల్పన, పద్మ, లావణ్య తదితరులు ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore