Nellore: నాగబాబు నియామకంపై నెల్లూరులో జనసేన సంబరాలు

Nellore: ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా కొణిదెల నాగబాబు నియామకాన్ని స్వాగతిస్తూ నెల్లూరు జనసేన కార్యాలయం వద్ద నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.

A Praveen, Nellore
Published on: 19 Aug 2026 4:10 PM IST
Nellore
X

Nellore: నాగబాబు నియామకంపై నెల్లూరులో జనసేన సంబరాలు

నెల్లూరు: జనసేన పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న శ్రీ కొణిదెల నాగబాబు గారికి ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా కేబినెట్ హోదా కల్పించడాన్ని స్వాగతిస్తూ నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద నాయకులు, జనసైనికులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.తమ వంతు బాధ్యతగా జనసేన నాయకులు మొక్కలు నాటి కొన్ని మొక్కలను పంచిపెట్టారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాగబాబు గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు కిషోర్ గునుకుల మాట్లాడుతూ, నాగబాబు గారికి లభించిన ఈ పదవి కేవలం ఒక అధికారిక హోదా కాదని, ఆంధ్రప్రదేశ్‌ను హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దే గొప్ప బాధ్యత, ఒక సంకల్పం అని పేర్కొన్నారు.

జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచీ పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.

గతంలోనే నాగబాబు గారు పలు ప్రాంతాలను దత్తత తీసుకుని వాటిని పచ్చదనంతో నింపేందుకు, అడవుల అభివృద్ధికి కృషి చేసి స్ఫూర్తిదాయకమైన ఫలితాలను సాధించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా మరింత విస్తృతమైన బాధ్యతను చేపట్టడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా హరితాభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

“సరైన వ్యక్తికి సరైన పదవి లభించింది. ప్రకృతిని ప్రేమించే, పర్యావరణ పరిరక్షణపై అవగాహనతో పనిచేసే నాగబాబు గారికి ఈ బాధ్యత రావడం హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి శుభసూచకం. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో పచ్చదనం పెరగాలని, అడవుల విస్తీర్ణం అభివృద్ధి చెందాలని, ప్రతి గ్రామం–ప్రతి నగరం పచ్చదనంతో కళకళలాడాలని కోరుకుంటున్నాం” అని కిషోర్ గునుకుల పేర్కొన్నారు.

నాగబాబు గారి నాయకత్వంలో “హరిత ఆంధ్రప్రదేశ్” లక్ష్యాన్ని సాకారం చేసేందుకు జనసేన నాయకులు, జనసైనికులు తమ వంతు బాధ్యతను భుజస్కంధాలపై వేసుకుని పనిచేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దాన్ని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నాగబాబు గారికి పదవి లభించిన సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ ఘన సంబరాల్లో నెల్లూరు జిల్లా నాయకులు కిషోర్ గునుకుల, నూని మల్లికార్జునయాదవ్, పప్పు నారాయణ, ప్రవీణ్ రెడ్డి, ఈగి సురేష్, సనత్ కుమార్, ప్రశాంత్ గౌడ్, రిషి యాదవ్, హేమచంద్ర యాదవ్, నాగేంద్ర బాలు, హరి తదితర నాయకులు, జనసైనికులు,వీరమహిళలు పాల్గొని నాగబాబు గారికి అభినందనలు తెలిపారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story