Nellore: నెల్లూరులో జనసేన ‘చాయ్ విత్ జనసైనిక్’
Nellore: నెల్లూరు నగరం 21వ డివిజన్ ఉమ్మారెడ్డిగుంట సెంటర్‌లో కిన్నెర కుమార్ ఆధ్వర్యంలో ‘చాయ్ విత్ జనసైనిక్’ కార్యక్రమం జరిగింది.
Nellore: నెల్లూరులో జనసేన ‘చాయ్ విత్ జనసైనిక్’
Nellore: నెల్లూరు నగర 21వ డివిజన్‌లో కిన్నెర కుమార్ ఆధ్వర్యంలో "చాయ్ విత్ జనసైనిక్" కార్యక్రమం ఉమ్మారెడ్డిగుంట సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు వంద మంది జనసైనికులు హాజరై పార్టీ బలోపేతంపై చర్చించారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు కిషోర్ గునుకుల మాట్లాడుతూ..
జిల్లాలో కమిటీలు, పదవుల కంటే జనసైనికుల ఐక్యత ముఖ్యమన్నారు. "మనమంతా ముందుగా జనసైనికులమే. మీలో ఒకడిగా ప్రజాసేవ చేయడానికి, జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గౌరవాన్ని నిలబెట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న తనకు, జనసేన కండువా మెడలో ఉండటం తలపై కిరీటం ధరించినంత గౌరవంగా అనిపిస్తుందని అన్నారు. ఆ గౌరవాన్ని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతి జనసైనికుడు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం పనిచేయాలని, ప్రతి వార్డులో, ప్రతి నియోజకవర్గంలో జనసైనికులు బలంగా ఉన్నారని, పార్టీ సూచించిన అభ్యర్థిని గెలిపించే శక్తి జనసేన కార్యకర్తలకు ఉందని సమాజానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
పార్టీలో నాయకులనే భేదాలు లేవని, అందరం కలిసి పనిచేసినప్పుడే జనసేన మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఎలాంటి కార్యక్రమమైనా ఐకమత్యంతో నిర్వహించాలని సూచించారు.
కొంతకాలంగా విడివిడిగా ఉన్న జనసైనికులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. యువ నాయకులు శరవణ తదితరులను కలుపుకుని ముందుకు సాగాలని, జనసేనను మరింత పటిష్టం చేసే కార్యాచరణను చేపట్టాలని కోరారు.
"విడివిడిగా ఉన్న జనసైనికులంతా ఒకటిగా మారితే అది గొప్ప ప్రజాశక్తిగా అవతరిస్తుంది. ప్రజల సమస్యల పరిష్కారానికి, పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు మనమంతా కలిసికట్టుగా పనిచేద్దాం" అని కిషోర్ గునుకుల పిలుపునిచ్చారు.
జనసేన నాయకులు వేములపాటి అజయ్ సూచనల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిన్నెర కుమార్, కిషోర్ గునుకుల, నూనె మల్లికార్జున యాదవ్, జమీర్,లాయర్ శ్రీరామ్,
కిన్నెర కుమార్, పసుపులేటి శర్వాన్,కరణం రవి, చలంచర్ల అఖిల్, బిరుదువోలు రమేష్, పెంచలయ్య, సాయిబాబా, శ్రీనివాసులు, మురళి, అలీ భాయ్, అయోధ్య, అరవ వినోద్, సూరి, ప్రభాకర్, ప్రశాంత్ గౌడ్, శివ, రాఘవ, శరవణ, హర్ష తదితరులతో పాటు మరియు 21వ డివిజన్ జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.




