Nellore: 71వ డివిజన్ జనసేన విజేత ఆలియాకు ఘన సన్మానం
Nellore: నెల్లూరు కార్పొరేషన్ 71వ డివిజన్ నుంచి గెలిచిన జనసేన అభ్యర్థి ఆలియాను సత్కరించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్.
Nellore: 71వ డివిజన్ జనసేన విజేత ఆలియాకు ఘన సన్మానం
నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 71వ డివిజన్ నుంచి జనసేన పార్టీ తరపున విజయం సాధించిన మహిళా నేత ఆలియాను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు ఆలియాకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల ఆదరాభిమానాలతో విజయం సాధించిన ఆలియా డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. మహిళా నాయకురాలిగా ఆమె సాధించిన విజయం అభినందనీయమని పేర్కొన్నారు.




