Nellore: వ్యక్తులు చేసే తప్పులకు కులాల రంగు పులమొద్దు.. జనసేన ప్రెస్ మీట్
Nellore: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కుల రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలపై జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nellore: వ్యక్తులు చేసే తప్పులకు కులాల రంగు పులమొద్దు.. జనసేన ప్రెస్ మీట్
Nellore: పవన్ కళ్యాణ్ ఒక జాతి సంపద కాదు, ఆయన జాతీయ సంపద అంటూ వైసీపీ నేతల తీరును తప్పుబట్టారు దుగ్గిశెట్టి సుజయ్ బాబు వైసీపీ కాపు నేతలు నోర్లు అదుపులో పెట్టుకోవాలని నల్లిశెట్టి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తులు చేసిపతప్పులకు కులాల రంగు పులమొద్దు అనే వ్యాఖ్యలకు మద్దతుగా నెల్లూరులోని మాగుంట లేఔట్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన నాయకుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
సమాజంలో కుల విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమని అన్నారు. వ్యక్తిగత సంఘటనలను కులాలకు అంటగట్టి, రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం తగదని పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం మానుకోవాలని, వైసీపీ నేతలకు సూచించారు. సమాజంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
పవన్ కళ్యాణ్ సమాజంలో ఐక్యతను పెంపొందించే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను జనసేన పార్టీ ఎప్పటికీ సహించదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన ప్రతిపక్షం, అనవసర వివాదాలను సృష్టించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమం లో దుగ్గిశెట్టి సుజయ్ బాబు, నల్లిశెట్టి శ్రీధర్,
చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, షేక్ అలియా, నాగిశెట్టి మురళి, శనివారపు అజయ్ బాబు ,బిల్ల ఉదయ్ కిరణ్, బండి అనిల్ రాయల్ ఆముదాల సుమంత్, పెడడా ఆనందరావు, మల్లిక తదితరులు పాల్గొన్నారు.




