Nellore: నెల్లూరు వైయస్సార్సీపీ 'జగన్ 2.ఓ' యాప్ ఆవిష్కరణ
Nellore: నెల్లూరులో ‘జగన్ 2.ఓ సూపర్ యాప్’ ఆవిష్కరించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి. కార్యకర్తల సమస్యలు, సోషల్ మీడియా వేధింపుల అరికట్టడమే లక్ష్యమని వెల్లడి.
Nellore: నెల్లూరు వైయస్సార్సీపీ 'జగన్ 2.ఓ' యాప్ ఆవిష్కరణ
నెల్లూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్ సిపి పార్టీ కార్యాలయంలో ‘జగన్ 2.ఓ సూపర్ యాప్’ ఆవిష్కరించారు మాజీ మంత్రివర్యులు మరియు జిల్లా పార్టీ అద్యక్షులు డా.కాకాణి గోవర్ధన్ రెడ్డి.
‘జగన్ 2.ఓ సూపర్ యాప్’ ఆవిష్కరణ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ....
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు అధికారిక ‘జగన్ 2.ఓ సూపర్‌యాప్’ను ఆవిష్కరిస్తున్నామని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వై.యస్.ఆర్.సి.పి వాళ్లు పోస్ట్ చేసిన కంటెంట్‌ను ఇష్టం వచ్చినట్లుగా, డిలీట్ చేయడం, అందుకోసం ఇష్టానుసారం కుట్రలు పన్నడం.. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఆదేశంతో పార్టీనే ఒక యాప్ తీసుకొచ్చి, ఒక ప్లాట్ ఫామ్‌ను పార్టీ క్రియేట్ చేస్తుందని, అదే జగన్ 2.ఓ సూపర్‌యాప్ అని చెప్పారు.
దీంట్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పొచ్చునని, అంతే కాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త, పార్టీతో అనుసంధానమై ఉంటాడని పేర్కొన్నారు. ఇది మన యాప్ కాబట్టి, మన వాళ్లే ఇందులోకి వస్తారు కాబట్టి, ఎవరు పడితే వారు డిలీట్ చేసే హక్కు కూడా వారికి ఉండదని అన్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఇష్టం వచ్చినట్లు చేసే కుట్రలు కూడా దీనివల్ల తిప్పి కొట్టొచ్చునని అన్నారు.
ఇంకా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త మొదలు, పార్టీ కేంద్ర కార్యాలయం వరకు.. నియోజకవర్గస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడితో, ప్రతి కార్యకర్త అనుసంధానమై ఉంటాడని, ఎందుకంటే పార్టీలో ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుందని, కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఏ అంశంపై కానీ, ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమై టచ్‌లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఈ యాప్‌లో మరో మంచి అంశం ఏమిటంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశం, ప్రెస్‌మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు.. అన్నీ కూడా ఈ యాప్‌లో లైవ్ ఫీడ్ ద్వారా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటుందని, భవిష్యత్తులో ఈ యాప్‌ను ఇంకా అభివృద్ధి చేయడం జరుగుతుందని, కార్యకర్తలు ఎక్కడైనా, ఏమైనా ఇబ్బంది పడుతుంటే వాటిని ఈ యాప్‌లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత పార్టీ వాటిపై స్పందించడం, నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఆ కార్యకర్తకు అండగా నిలబడే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.
పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న మన పార్టీ వారు, ఇంకా రాజకీయ వేధింపులకు గురవుతున్న వారు కూడా ఇప్పుడు డిజిటల్ డైరీలో నమోదు చేస్తున్న వివరాలు.. ఆ డైరీ కూడా ఈ యాప్‌తో అనుసంధానం అవుతుందని, అంటే ఈ యాప్‌లో ఆ డిజిటల్ డైరీ కూడా అందుబాటులోకి వస్తుందని, దాని వల్ల వేధింపుల, సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేరుగా ఈ యాప్ ద్వారా డిజిటల్ డైరీలో వాటిని ఫిర్యాదు చేయొచ్చునని ఆ వివరాలు నమోదు చేయొచ్చునని చెప్పారు.
ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై , కార్యకర్తలపై చేస్తున్న అనుచిత విమర్శలు, వీడియోలు, వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసి, వాటిని తొలగింపచేసే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే, మరోవైపు ఈ సూపర్‌యాప్‌ను ఎవరూ ఆపలేని విధంగా మన పార్టీ నాయకులు , కార్యకర్తల కోసం పార్టీనే సొంతంగా రూపొందించుకోవడం జరిగిందని, ఈ యాప్ వల్ల ప్రతి కార్యకర్త నిత్యం, పార్టీ నాయకత్వంతో అనుసంధానమై ఉంటాడని చెప్పారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.




