Nellore: కలువాయిలో ఘనంగా ప్రారంభమైన రెండు రోజుల మహానాడు వేడుకలు
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో టీడీపీ మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Nellore: కలువాయిలో ఘనంగా ప్రారంభమైన రెండు రోజుల మహానాడు వేడుకలు
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనలతో కలువాయి మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు చల్లా రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు మహానాడు వేడుకలు ప్రారంభమయ్యాయి, క్లస్టర్-1 కలువాయిలోని ఆర్యవైశ్య కళ్యాణమండపంలో మరియు క్లస్టర్-2 దాచూరు లక్ష్మీ నృసింహస్వామి కల్యాణ మండపంలో నిర్వహించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ పద్ధతిలో చేసిన ప్రసంగాన్ని నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సీఎం చేసిన ప్రసంగానికి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




