Nellore: కలువాయిలో మేత పోరంబోకు భూమి ఆక్రమణ.. గ్రామస్థుల ఆగ్రహం!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం తిరుమలపాడు గ్రామంలో 625 ఎకరాల ప్రభుత్వ మేత పోరంబోకు భూమి ఆక్రమణకు గురవుతోంది.

Madhav Goud, Nellore
Published on: 24 May 2026 8:06 PM IST
Nellore
X

Nellore: కలువాయిలో మేత పోరంబోకు భూమి ఆక్రమణ.. గ్రామస్థుల ఆగ్రహం!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం పరిధిలోని కేశమనేనిపల్లి పంచాయతి పరిధిలోని తిరుమలపాడు గ్రామంలో 438 సర్వే నంబర్‌లో ఉన్న 625 ఎకరాల మేత పోరంబోకు భూమి ప్రస్తుతం ఆక్రమణదారులు ఆక్రమించు కొంటున్నారని గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా గ్రామ ప్రజలు తమ పశువులను మేపుకునేందుకు ఉపయోగించుకుంటున్న ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు దొంగ విద్యుత్ కనెక్షన్లతో అర్ధరాత్రి వేళల్లో బోర్లు వేసి, భారీ యంత్రాలతో భూమిని చదును చేసి నిమ్మ తోటలుగా మార్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

గతంలో కూడా ఇదే విధంగా ఆక్రమణలు జరిగితే అధికారులు వచ్చి తొలగించారని, కానీ మళ్లీ అదే దందా కొనసాగుతుండటంపై గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారని,అక్రమంగా బోర్లు వేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. వెంటనే రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకొని మేత పోరంబోకు భూమిని రక్షించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story