Nellore: నెల్లూరులో ఉత్సాహంగా కిమ్స్ ‘5కే రన్’..!
Nellore: ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 'లైఫ్ టైమ్ ఆఫ్ లంగ్' నినాదంతో 5కే రన్ నిర్వహించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
Nellore: నెల్లూరులో ఉత్సాహంగా కిమ్స్ ‘5కే రన్’..!
Nellore: ఊపిరితిత్తుల ఆరోగ్యం, వాటి ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో నెల్లూరులో 5కే రన్ నిర్వహించారు. ‘లైఫ్ టైమ్ ఆఫ్ లంగ్’ అనే నినాదంతో కిమ్స్ హాస్పిటల్ నుంచి వీఆర్‌సీ సెంటర్ వరకు ఈ పరుగు కార్యక్రమం సాగింది.
ఈ 5కే రన్‌లో వైద్యులు, రన్నర్లు, ఆసుపత్రి సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పలువురు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని కార్యక్రమం ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ఊపిరితిత్తులు మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలని, వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ధూమపానం, కాలుష్యం వంటి కారణాల వల్ల ఊపిరితిత్తులపై ప్రభావం పడే అవకాశం ఉందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజల్లో లంగ్స్ ఆరోగ్యంపై చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే 5కే రన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.




