Nellore: నెల్లూరులో కిమ్స్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల ర్యాలీ!

Nellore: తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సుబ్బారెడ్డి స్టేడియం వరకు ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Aug 2026 3:53 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో కిమ్స్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల ర్యాలీ!

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అవగాహన ర్యాలీ... నెల్లూరు కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో

ఆగస్టు ఒకటవ తేదీ నుంచి,ఆగస్టు ఏడవ తేదీ వరకు జరిగే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను, పురస్కరించుకొని,నెల్లూరు కిమ్స్ హాస్పిటల్స్ తరఫున కిమ్స్ హాస్పిటల్ నుంచి సుబ్బారెడ్డి స్టేడియం వరకు విశేష అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు.నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ వారు మీడియాతో మాట్లాడుతూ...తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరం,దాని విశిష్టత ఎంతటిది అనే విషయాలపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దిశం...పుట్టినప్పటి నుండి బిడ్డకు తల్లిపాలే అత్యంత ముఖ్యం.బిడ్డ ఆరోగ్యానికి, అలాగే తల్లి ఆరోగ్యానికి కూడా తల్లిపాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం...ప్రస్తుత బిజీ షెడ్యూల్స్,ఆఫీసులకు వెళ్లడం వంటి పనుల వల్ల చాలామంది బిడ్డలకు తల్లిపాలు సరిగా ఇవ్వలేకపోతున్నారు. కానీ కనీసం ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా తల్లిపాలు ఇవ్వడం చాలా అవసరం...తల్లికి-బిడ్డకు మధ్య మంచి అనుబంధం ఏర్పడాలన్నా, భవిష్యత్తులో బిడ్డ అనారోగ్యాల బారిన పడకుండా మంచి ఆరోగ్యంతో ఎదగాలన్నా తల్లిపాలు (ముర్రుపాలు) ఎంతో ఆరోగ్యకరమైనవి...తల్లిపాల వల్ల తల్లికి,బిడ్డకు కలిగే ఉపయోగాలను సమాజంలో ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ప్రతి తల్లి తమ బిడ్డకు తప్పకుండా తల్లిపాలు ఇవ్వాలి అని తెలిపారు....

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story