Nellore: బుజబుజనెల్లూరులో కూటమి అభ్యర్థుల ప్రచార ర్యాలీ హోరు!
Nellore: నెల్లూరు 34వ డివిజన్ బుజబుజనెల్లూరులో కూటమి ప్రచార ర్యాలీ. మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ అభ్యర్థి చాముండేశ్వరి గెలుపుకు గిరిధర్ రెడ్డి విజ్ఞప్తి.
Nellore: బుజబుజనెల్లూరులో కూటమి అభ్యర్థుల ప్రచార ర్యాలీ హోరు!
నెల్లూరు: నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్ బుజబుజనెల్లూరులో ఎన్నికల ప్రచార ర్యాలీలో నెల్లూరు నగర మేయర్ కూటమి అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నెల్లూరు నగర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రాబోయే ఎన్నికల్లో నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ని, అలాగే 34వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి బోనబోయిన చాముండేశ్వరి ని అత్యధిక ఓట్లు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




