Nellore: 12వ డివిజన్‌లో ప్రజాబాటలో పర్యటించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
Nellore: నెల్లూరు రూరల్ 12వ డివిజన్‌లో ప్రజాబాటలో పర్యటించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Nellore: 12వ డివిజన్‌లో ప్రజాబాటలో పర్యటించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ప్రజాబాటలో భాగంగా 12వ డివిజన్ వావిలేటిపాడు సత్యం జీ లేఅవుట్‌లో స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు స్థానిక నాయకులు మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి... ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను కోరారు.
ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో చర్చించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకొని, సమస్యల పరిష్కారానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు..
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి 12వ డివిజన్ అభివృద్ధికి 12 కోట్ల 50 లక్షల రూపాయలను కేటాయించామని, ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో టీడీపీ నాయకులు మావిళ్ల రవీంద్రరెడ్డి, చింతా ప్రభాకర్ రెడ్డి, మడపర్తి శ్రీనివాసులు, అన్నపురెడ్డి సురేష్, కుండ వెంకటరమణయ్య, తుమ్మ తనూజ, కుంచాల విజయభాస్కర్, తలమంచి హరిప్రసాద్ రెడ్డి, అల్తూరు మస్తానయ్య, శ్రీ సత్యం జి నగర్ హౌస్ అండ్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి, బాల రవికుమార్, మల్లికార్జున్ రావు, వెంకట శేషయ్య, శ్రీనివాస కుమార్ మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొనారు.




