Nellore: సీఎం చంద్రబాబు సహా నేతల చిత్రపటాలకు దిష్టి తీసిన కోటంరెడ్డి

Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి నేతల చిత్రపటాలకు దిష్టి తీసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి. నెల్లూరు కార్పొరేషన్‌కు రూ.240 కోట్లు కేటాయింపు.

V. Narasimhulu, Nellore
Published on: 22 Sept 2026 5:05 PM IST
Nellore
X

Nellore: సీఎం చంద్రబాబు సహా నేతల చిత్రపటాలకు దిష్టి తీసిన కోటంరెడ్డి

నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిరాఘాటంగా సాగాలని, ఆ దేవుడి ఆశీస్సులు వారిమీద ఉండాలని, ఎక్కడా కూడా ఏ దిష్టి వారికి తగలకూడదని, భారత ప్రధాన మంత్రివర్యులు నరేంద్ర మోదీ , రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , యువనేత & రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ , రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చిత్రపటాలకి దిష్టి తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ అద్భుత రాజధాని, ఆంధ్రప్రదేశ్ పోలవరం పరుగులు పెట్టిస్తూ, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి స్వర్గధామంగా ముందుకు సాగుతున్న ఈ యొక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని రకాల నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దిష్టి, వైకాపా నాయకుల తిట్లు, వైకాపా నాయకుల శాపనార్థాలు వారికి తగలకూడదని, వారి చిత్రపటాలకి దిష్టి తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తమ సమర్థ నాయకత్వాలతో, చక్కటి సమన్వయంతో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలకి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్‌ని బంగారు బాటలు వేసేదానికి సమర్థ పరిపాలనతో ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పారు..

ఒకపక్క సంక్షేమం, మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి, ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, మరోపక్క రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్ని సమర్థవంతంగా చేపడుతూ, మారుమూల గ్రామాలకు సైతం నగరాలా, గ్రామాలా తేడా లేకుండా ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ... అన్నింటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కి ఒక అద్భుత రాజధాని అమరావతి నిర్మాణం సాగిస్తూ, ఆంధ్రప్రదేశ్ దశ-దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ...

అనేక రకాల సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టి సారిస్తూ పనులు వేగవంతం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... మరీ ముఖ్యంగా భవిష్యత్తులో మన బిడ్డల ఉద్యోగాల కోసం... మన బిడ్డల భవిష్యత్తులో ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకో, ఇతర దేశాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే విధంగా తీర్చిదిద్దుతూ...

ఈ దేశంలో ఉండే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈర్ష్యపడే విధంగా చంద్రబాబు నాయుడు పెట్టుబడులని ఆకర్షిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు సూచనలతో,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అనేక ప్రయత్నాలు చేస్తూ, అనేక రకాల పెట్టుబడులని ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తూ ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పారు.. ఇందులో భాగంగా ఈరోజు మరో ముందడుగు. ఎక్కడైతే అభివృద్ధి పనులు అవసరమో అక్కడ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని వేలాది కోట్ల రూపాయలతో ఆంధ్రరాష్ట్రంలో అభివృద్ధి పనుల శ్రీకారం చుడితే, అందులో భాగంగా ఆ వేలాది కోట్లలో భాగంగా అక్షరాలా 240 కోట్లు. నెల్లూరు నగర కార్పొరేషన్‌కి కేటాయించడం జరిగిందని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

240 కోట్ల నిధులు అభివృద్ధి పనులకు నెల్లూరు నగర కార్పొరేషన్‌కి కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువనేత &రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి, రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణకి మనస్ఫూర్తిగా నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూరల్ నియోజకవర్గంలోని డివిజన్లలో గత రెండేళ్లలో చరిత్ర ఎరుగని అభివృద్ధిని ఇక్కడ చేసి చూపించామో మీ అందరికీ కూడా తెలుసు. ఇందుకు అందరూ సహకరించారు. ముఖ్యంగా జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బీద రవిచంద్రకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమిని 100 కి 100 శాతం గెలిపించాలని, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఒక మంచి ప్రభుత్వం, ఒక ప్రజా ప్రభుత్వం, అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, పోలవరం, అమరావతి... అన్నింటికీ మించి భద్రత... ఒక సమర్థవంతమైన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వానికి మద్దతు పలకాలని కోరారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

రాబోయే స్థానిక ఎన్నికలలో నెల్లూరు నగర కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, రాజకీయాల్లో మరియు పోటీలో 21 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న జెన్-జీ (Gen-Z) యువతకు తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore