Nellore: ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నిండాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి!
Nellore: ప్రజల జీవితాల్లో సుఖసంతోషాల వెలుగులు నిండాలని కోరుతూ కోవూరు ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Nellore: ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నిండాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి!
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించి, టపాసులు కాల్చుకునే పండుగ మాత్రమే కాదని, చెడుపై మంచి సాధించిన విజయానికి, ధర్మం వైపు నిలబడాలనే గొప్ప సందేశానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించే విశిష్టమైన పండుగ దీపావళి అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు.
ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, సంతోషాలు, సుఖసంతోషాల వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.




