Nellore: నెల్లూరులో ఘనంగా 2026 లంబోదర గణేష్ ఉత్సవాలు

Nellore: నెల్లూరులో సెప్టెంబర్ 14 నుంచి లంబోదర గణేష్ ఉత్సవాలు. 21 అడుగుల మట్టి విగ్రహం, ఒక్క రూపాయి చందా వసూలు చేయబోమని కమిటీ సభ్యుల ప్రకటన.

V. Narasimhulu, Nellore
Published on: 5 Aug 2026 3:16 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఘనంగా 2026 లంబోదర గణేష్ ఉత్సవాలు

నెల్లూరు: నెల్లూరు నగరంలో ఘనంగా జరగనున్న 2026 లంబోదర గణేష్ ఉత్సవాల వివరాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు పలు కీలక విషయాలను పంచుకున్నారు.

"గత సంవత్సరాల విజయాలు"

మొదటి సంవత్సరం (2024) కేవలం 50 మందితో ప్రారంభమైన ఈ కమిటీ, తమిళనాడులోని తంజావూరు సెట్టింగ్‌ను పోలిన అద్భుతమైన సెట్టింగ్‌తో నెల్లూరులో ఉత్సవాలు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని చెప్పారు

"రెండో సంవత్సరం (2025)"

మహారాష్ట్ర పూణేలోని త్రిశూద్ గణపతి ఆలయ స్ఫూర్తితో, 90 శాతం మందికి తెలియని 'మూడు తొండాల వినాయకుడు - నెమలి వాహనం' రూపాన్ని నెల్లూరుకు తీసుకువచ్చి ఘనంగా ఉత్సవాలు జరిపామని చెప్పారు.

"2026 ప్రత్యేకతలు & విశేషాల"

శరభ వాహన గండ బెరుండ అవతారం:-- మూడో సంవత్సరమైన ఈసారి (2026), కమిటీ సభ్యులందరి ఏకగ్రీవ నిర్ణయం మేరకు అత్యంత విశిష్టమైన ' శరభ వాహన - గండ భేరుండ వినాయకుడు' అవతారంలో వినాయక ఉత్సవాలు నిర్వహించనున్నారు. పురాణాల ప్రకారం నరసింహ స్వామిని శాంతింపజేయడానికి శివుడు శరభ రూపం దాల్చగా, ఆ శరభ, గండ పేరుండ పక్షుల మధ్య జరిగే పౌరాణిక ఘట్టం ఆధారంగా ఈ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు.

"పర్యావరణ హితం (ఎకో-ఫ్రెండ్లీ)"

పర్యావరణ పరిరక్షణ కోసం ఈసారి పూర్తిగా మట్టితో తయారు చేసిన 21 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఇక్కడే తయారు చేయించి ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకుండా పూర్తిగా పర్యావరణ హితంగా ఈ ఉత్సవాలు జరుగనున్నాయని తెలిపారు.

"ముఖ్యమైన ప్రకటన - చందాలు లేవు"

ఒక రూపాయి కూడా చందాలు వసూలు చేయము: లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఈ సంవత్సరం (2026) నుండి ఒక రూపాయి చందా కూడా వసాలు చేయకుండా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించనుంది.

నెల్లూరు నగర ప్రజలు లేదా భక్తులు ఎవరైనా చందాలు అడిగితే ఇవ్వవద్దని, కమిటీ సభ్యులు ఎవరూ చందాల కోసం ఎవరి షాపులకూ లేదా ఇళ్లకూ వెళ్లరని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా కమిటీ పేరుతో చందాలు వసూలు చేస్తే వెంటనే కమిటీ సభ్యులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఉత్సవాలకు అయ్యే పూర్తి ఖర్చును లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులే భరిస్తారని తేల్చిచెప్పారు.

"సెప్టెంబర్ 14 నుండి ఉత్సవాలు" ప్రధాన కార్యక్రమాలు :

సెప్టెంబర్ 14 (ఉదయం 09:10 గంటలకు): విగ్రహ ప్రతిష్ట మరియు సాయంత్రం 06:00 గంటల నుండి ఐదు రోజుల పాటు ప్రత్యేక మహా ధూప హారతి కార్యక్రమం ప్రారంభం అవుతుంది అని చెప్పారు.

సెప్టెంబర్ 15 (ఉదయం 08:00 నుండి): పూజా కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాలు మరియు ఉదయం 09:00 గంటలకు విద్యా గణపతి పూజ (విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, పెన్నులు అందజేత). మధ్యాహ్నం 04:00 గంటలకు పుట్టి మహోత్సవం (గుర్రాలపై ఊరేగింపు).

సెప్టెంబర్ 16 ఉదయం పూజలు, నిరంతర ప్రసాద వితరణ (ఉదయం 06:00 నుండి రాత్రి 12:00 వరకు). సాయంత్రం 06:30 గంటలకు 108 రకాల పూలతో పూలాంగి సేవ ప్రధానాకర్షణగా నిలుస్తుంది అని అన్నారు. సెప్టెంబర్ 17 గరిక పూజ, సాయంత్రం మహా ధూప హారతి మరియు సాయంత్రం 07:00 గంటలకు కలాంజలి లైవ్ ఆర్కెస్ట్రా & రాక్‌స్టార్ మహి ఈవెంట్స్ ఆధ్వర్యంలో భారీ సంగీత, నాట్య కార్యక్రమాలు అలాగే లంబోదర గణేష్ లడ్డు వేలం పాట కొనసాగుతోంది అని చెప్పారు.

సెప్టెంబర్ 18 (శుక్రవారం - చివరి రోజు) ఉదయం పూజలు, సాయంత్రం మహా ధూప హారతి. రాత్రి 20 కళా బృందాలు, హైదరాబాద్ డిజె మరియు కాశీ అఘోరాల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, అఘోరాల నిమజ్జన కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని అన్నారు.

"సందర్శక విజ్ఞప్తి"

ఈ ఉత్సవాలు ఏ ఒక్క పార్టీకి, కులానికి, మతానికి చెందినవి కావు. అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు మరియు వర్గాల ప్రజలందరి కమిటీ ఇది. కాబట్టి నెల్లూరు నగర, జిల్లా ప్రజలందరూ, రాజకీయ నాయకులందరూ ఈ ఉత్సవాలలో భారీ సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని కోరుతున్నామని చెప్పారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story