Marripadu: పొలాల దారి ఆక్రమించి నిర్మాణాలు.. మర్రిపాడులో అధికారుల నిర్లక్ష్యం!
Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో అధికార పార్టీ నేత హైవే స్థలాన్ని కబ్జా చేసి, రైతుల పొలాల దారికి అడ్డంగా అక్రమ షెడ్డు నిర్మాణం చేపట్టారు.
Marripadu: పొలాల దారి ఆక్రమించి నిర్మాణాలు.. మర్రిపాడులో అధికారుల నిర్లక్ష్యం!
Marripadu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మర్రిపాడు మండలంలో భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ జాగా కనిపిస్తే పాగా వేస్తున్నారు.నకిలీ పత్రాలతో రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లపైకి ఎక్కించుకుని స్వాహా చేస్తున్నారు. హైవే స్థలాలను సైతం కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని కృష్ణాపురంలో ఓ అధికార పార్టీ నాయకుడు ఏకంగా హైవే స్థలాన్ని ఆక్రమించి పొలాల్లోకి వెళ్లే దారికి అడ్డంగా షెడ్డు నిర్మాణం చేపట్టాడు. దీంతో రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైతుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాన్ని పరిశీలించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా ఆక్రమణదారుడు లెక్కచేయకుండా నిర్మాణ పనులను కొనసాగిస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి ఆక్రమణలను తొలగించి దారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.




