Nellore: నెల్లూరు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ స్థానిక సెలవు!
Nellore: నెల్లూరు జిల్లాలో ఈ నెల 5న జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్థానిక సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ హిమాన్షు శుక్ల.
Nellore: నెల్లూరు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ స్థానిక సెలవు!
Nellore: నెల్లూరు జిల్లాలో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్ల ఉత్తర్వులు జారీ చేశారు.
పోలింగ్ నిర్వహించే ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థలు, ఇతర భవనాలకు నవంబర్ 4, 5 తేదీల్లో సెలవు ప్రకటించారు. అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు నవంబర్ 5న స్థానిక సెలవు ప్రకటించారు.
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.




