Marripadu: మర్రిపాడులో దారుణం: రోకలిబండతో బాది దాయాది హత్య

Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగరాజుపాడులో ఆస్తి వివాదాలు, పాత కక్షల నేపథ్యంలో రోకలిబండతో కొట్టి దాయాదిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 2 Oct 2026 3:10 PM IST
Marripadu
X

Marripadu: మర్రిపాడులో దారుణం: రోకలిబండతో బాది దాయాది హత్య

నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలం నాగరాజుపాడులో దారుణం చోటుచేసుకుంది.పాత గొడవలు, ఆస్తి వివాదం నేపథ్యంలో కుంభగిరి గోపి తన దాయాది కుంభగిరి రాజగోపాల్ పై దాడికి పాల్పడ్డాడు.

మద్యం మత్తులో ఉన్న గోపి, రాజగోపాల్ పై రోకలిబండతో దాడి చేయడంతో రాజగోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)