Nellore: లారీని ఢీకొట్టి బోల్తా పడ్డ ఆటో.. 10 మంది కూలీలకు తీవ్ర గాయాలు
Nellore: నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Nellore: లారీని ఢీకొట్టి బోల్తా పడ్డ ఆటో.. 10 మంది కూలీలకు తీవ్ర గాయాలు
Nellore: నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రం వద్ద 16 నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది... వేగంగా వెళుతున్న ఆటో ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు పదిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి కాళ్లు చేతులు విరిగాయి. తలలు పగిలాయి. క్షతగాత్రులను హుటాహుటిన గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.. ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో.. కంట్రోల్ తప్పిన ఆటో, లారీని ఢీ కొట్టి బోల్తా పడింది. జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీ. ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో. వెనుకనే వస్తున్న ఆటో, కంట్రోల్ తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులు గూడూరు రూరల్ మండలం చెన్నూరు కు చెందిన కూలీలు.
మనుబోలు మండలం వీరంపల్లి లోని ఓ రొయ్యల కేంద్రం ప్రాసెస్ యూనిట్ లో పనిచేసేందుకు వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు.. హైవే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కు సమీపంలో, ఈ దుర్ఘటన జరగడంతో.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ ద్వారా.. క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.




