Nellore: రొట్టెల పండుగ వేదికగా మేయర్ దేవరకొండ సుజాత తనిఖీలు

Nellore: నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ నాలుగో రోజు నగర మేయర్ దేవరకొండ సుజాత దర్గా ప్రాంగణంలో పర్యటించి భక్తుల వసతులు, పారిశుధ్యాన్ని పరిశీలించారు.

V. Narasimhulu, Nellore
Published on: 29 Jun 2026 9:36 PM IST
Nellore
X

Nellore: రొట్టెల పండుగ వేదికగా మేయర్ దేవరకొండ సుజాత తనిఖీలు

Nellore: బారా షహిద్ దర్గా రొట్టెల పండుగ నాలుగో రోజైన సోమవారం నెల్లూరు నగర మేయర్ గౌరవ దేవరకొండ సుజాత దర్గా ప్రాంగణంలోని వివిధ విభాగాలను తనిఖీ చేసి భక్తులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం ద్వారా సీసీ కెమెరాల మానిటరింగ్ వ్యవస్థను పరిశీలించారు. దర్గా ప్రాంగణంలోని ప్రభుత్వ వైద్య శిబిరం ద్వారా ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల మందును మేయర్ వేశారు.

అనంతరం ప్రాంగణంలో రొట్టెల పండుగ విధుల నిర్వహణలో ఉన్న అన్ని విభాగాల సిబ్బందికి అందజేస్తున్న భోజనాన్ని మేయర్ తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించారు. లంగర్ ఖానాల ద్వారా భక్తులకు అందజేస్తున్న ఆహార పంపిణీ కార్యక్రమంలో మేయర్ స్వయంగా పాల్గొని భక్తులకు భోజనాన్ని అందజేశారు.

రొట్టెల పండుగ విచ్చేసే భక్తులు పూర్తిస్థాయిలో వెళ్లేంతవరకు దర్గా ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణ పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని శానిటేషన్ విభాగం అధికారులను మేయర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, శానిటేషన్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story