Nellore: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్!
Nellore: నెల్లూరులోని నివాసంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరు మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ కలిశారు. విజయం సాధించినందుకు మంత్రి అభినందనలు.
Nellore: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్!
Nellore: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరు నగర మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు నగరంలోని మంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సత్కరించిన మేయర్ రూప్ కుమార్, తన విజయానికి అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం మేయర్ రూప్ కుమార్ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సాధించిన ఘన విజయంపై హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో 61వ డివిజన్ కార్పొరేటర్ ఆనం రంగం మయూర్ రెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, అల్లంపాటి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




