Nellore: నేషనల్ క్రిటికల్ కేర్ డే వేడుకలు - మెడికవర్ ఆసుపత్రి వైద్యులు

Nellore: నెల్లూరు మెడికవర్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ డే వేడుకలు నిర్వహించారు. అత్యవసర వైద్య సేవలతో ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు తెలిపారు.

A Praveen, Nellore
Published on: 9 Oct 2026 6:24 PM IST
Nellore
X

Nellore: నేషనల్ క్రిటికల్ కేర్ డే వేడుకలు - మెడికవర్ ఆసుపత్రి వైద్యులు

నెల్లూరు: అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్య సహాయం అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని నెల్లూరు మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నేషనల్ క్రిటికల్ కేర్ డే సందర్భంగా ఆసుపత్రి క్రిటికల్ కేర్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ ఏడాది “క్రిటికల్ కేర్ టు కమ్యూనిటీ డోర్‌స్టెప్” (Critical Care to Community Doorstep) అనే థీమ్‌ను పురస్కరించుకుని, అత్యవసర వైద్య సేవలు కేవలం ఆసుపత్రులలోని ఐసీయూలకే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు.

గుండెపోటు, శ్వాస సంబంధిత సమస్యలు, ఇతర ప్రాణాపాయ పరిస్థితులను ముందుగానే గుర్తించడం, బాధితులకు తక్షణ ప్రాథమిక సహాయం అందించడం, ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని వైద్యులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా వ్యవహరించడం, సరైన సమయంలో వైద్య సహాయం పొందడం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు.

క్రిటికల్ కేర్ సేవల ప్రాధాన్యతను ప్రజలకు వివరించడంతో పాటు, అత్యవసర వైద్యంపై అవగాహనను సమాజంలోని అన్ని వర్గాలకు చేరవేయడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ గౌతమ్ పునుగోటి, కన్సల్టెంట్లు డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ మనోహర్, డాక్టర్ సుప్రజ, డాక్టర్ దీప్తి, డాక్టర్ సిరీష పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore