Nellore: "అత్యాధునిక గుండె శస్త్ర చికిత్సలో నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ అరుదైన ఘనత"
Nellore: నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ కార్డియోథొరాసిక్ విభాగం 400కు పైగా గుండె శస్త్రచికిత్సలను 99.5% విజయవంతంగా పూర్తి చేసింది.
Nellore: "అత్యాధునిక గుండె శస్త్ర చికిత్సలో నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ అరుదైన ఘనత"
Nellore: నెల్లూరు మరియు పరిసర జిల్లాల ప్రజలకు, అత్యాధునిక గుండె శస్త్రచికిత్స సేవలను అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ మరో అరుదైన ఘనత సాధించింది.. కార్డియోథొరాసిక్ & వాస్క్యులర్ సర్జరీ విభాగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఆసుపత్రిలో ఇప్పటివరకు 400కు పైగా కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్సలు 99.5 సక్సెస్ రేట్ తో విజయవంతంగా నిర్వహించబడిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఈ శస్త్రచికిత్సల్లో కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (CABG), హార్ట్ వాల్వ్ రీప్లేస్‌మెంట్, మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలు, జన్యుపరమైన గుండె లోపాల శస్త్రచికిత్సలు, థొరాసిక్ మరియు ఛాతీ సంబంధిత క్లిష్ట ఆపరేషన్లు ఉన్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక కార్డియాక్ ఐసీయూ సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం సహకారంతో రోగులకు అత్యుత్తమ ఫలితాలు అందుతున్నాయి.
ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. విజ్ఞా చరణ్ మాట్లాడుతూ..
"400కు పైగా కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం మా బృందానికి గర్వకారణం అని, అత్యాధునిక సాంకేతికత, నిపుణులైన వైద్యుల సేవలు మరియు రోగి-కేంద్రిత చికిత్సా విధానంతో మరింత మంది రోగులకు నాణ్యమైన గుండె వైద్య సేవలు అందించడమే మా లక్ష్యం అని చెప్పారు. భవిష్యత్తులో మరింత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం" అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సెంటర్ హెడ్ లావణ్య పాల్గొన్నారు.




