Nellore: నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్‌లో నూతన వైద్య విధానం

Nellore: నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో సరికొత్త 'ట్యూమర్-మార్కర్ క్లిప్' విధానం విజయవంతం. వివరాలు వెల్లడించిన వైద్యులు.

A Praveen, Nellore
Published on: 18 Aug 2026 6:11 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్‌లో నూతన వైద్య విధానం

నెల్లూరు: బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆసుపత్రికి చెందిన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ నెరెల్ల కృష్ణ తేజ ఆధ్వర్యంలో ‘ఇమేజ్-గైడెడ్ ఇంట్రాలెషనల్ బ్రెస్ట్ ట్యూమర్-మార్కర్ క్లిప్ ప్లేస్‌మెంట్’ విధానాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాలు:

ఖచ్చితమైన గుర్తింపు: శస్త్రచికిత్సకు ముందు ఇచ్చే కీమోథెరపీ వల్ల ట్యూమర్ సైజ్ తగ్గిపోయినా లేదా పూర్తిగా కనిపించకుండా పోయినా, క్లిప్ సహాయంతో ట్యూమర్ ఉన్న అసలు స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించవచ్చు.

మెరుగైన సర్జరీ ఇది శస్త్రచికిత్సను మరింత సులభతరం చేయడమే కాకుండా, బ్రెస్ట్-కన్సర్వింగ్ సర్జరీ (రొమ్మును కాపాడే శస్త్రచికిత్స)కి ఎంతో దోహదపడుతుంది.

మెరుగైన సమన్వయం: రేడియాలజిస్ట్, ఆంకాలజిస్ట్, బ్రెస్ట్ సర్జన్ల మధ్య సమర్థవంతమైన సమన్వయానికి ఇది ఉపయోగపడుతుంది.

ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ తేజ మాట్లాడుతూ, ఈ చిన్న క్లిప్ ప్లేస్‌మెంట్ చికిత్స ప్రణాళికలో ఖచ్చితత్వాన్ని పెంచుతుందని తెలిపారు. ఈ ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల నెల్లూరు మరియు పరిసర ప్రాంతాల క్యాన్సర్ రోగులకు ఎంతో మేలు జరుగుతుందని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story