Nellore: నెల్లూరులో అట్టహాసంగా గురుపూజోత్సవం – మంత్రి నారాయణకు సన్మానం
Nellore: నెల్లూరు డిఎస్ఆర్, ఆర్ఎస్ఆర్ హైస్కూళ్లలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.
Nellore: నెల్లూరులో అట్టహాసంగా గురుపూజోత్సవం – మంత్రి నారాయణకు సన్మానం
నెల్లూరు: నెల్లూరు ప్రభుత్వ పాఠశాలల్లో గురుపూజోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. డిఎస్ఆర్, ఆర్ఎస్ఆర్ హైస్కూల్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
విద్యార్థులు మంత్రి, ఎంపీలకు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలుపగా, కార్యక్రమంలో ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన మంత్రి నారాయణ గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముందస్తుగా శాలువా కప్పి, పూలగుచ్ఛం అందించి ప్రత్యేకంగా సన్మానించారు.
అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి నారాయణ గారు చిన్నప్పటి నుంచే ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించి, విద్యార్థి దశలోనే ఎంతో మంది పేద పిల్లలకు ఉచితంగా చదువు ఇప్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేశారు. విద్యార్థి దశ నుంచే సరైన మార్గదర్శకత్వం అందిస్తూ, క్రమశిక్షణతో ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిన గొప్ప నాయకుడు ఆయన. ముఖ్యంగా ఈ డీఎస్ ఆర్, ఆర్ఎస్ఆర్ పాఠశాలల సమగ్ర అభివృద్ధిలో, కార్పొరేట్ స్థాయికి మించి తీర్చిదిద్దడంలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు.
నారాయణ సార్ కల్పించిన ఈ గొప్ప అవకాశాన్ని, మౌలిక వసతులను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలి అని పిలుపునిచ్చారు.మంత్రి నారాయణ మాట్లాడుతూ.. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతీ ఏటా గురుపూజోత్సవం జరుపుకుంటున్నామని, ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని దాగివున్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలని కోరారు.
యువనేత లోకేష్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని, దానికి అనుగుణంగానే డిఎస్సార్, ఆర్ఎస్సార్ స్కూళ్లతో పాటు నెల్లూరు సిటీలోని అన్ని ప్రభుత్వ హైస్కూళ్లను వేగంగా ఆధునీకరిస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు అత్యంత నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత, కమిషనర్ నందన్, డిఈఓ బాలాజీ రావు, ఎంఈఓ తిరుపాల్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్ళపాక అనూరాధ, మాజీ జెడ్పిటిసి విజేతారెడ్డి, కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, స్థానిక నేతలు అన్నంగి ప్రసాద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు."




