Nellore: వీఆర్‌సీ గ్రౌండ్‌లో వాకర్స్‌తో మంత్రి నారాయణ 'మాట మంతీ'
Nellore: నెల్లూరు వీఆర్‌సీ గ్రౌండ్‌లో వాకర్స్‌తో మంత్రి నారాయణ ముచ్చట. నగర అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ.
Nellore: వీఆర్‌సీ గ్రౌండ్‌లో వాకర్స్‌తో మంత్రి నారాయణ 'మాట మంతీ'
నెల్లూరు: నగరంలోని వీఆర్‌సీ గ్రౌండ్‌లో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ‘మాట మంత్రి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్‌తో మంత్రి నారాయణ ముచ్చటిస్తూ నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
నెల్లూరు నగరంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, వాటి పురోగతిపై వాకర్స్ అభిప్రాయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. నగరానికి సంబంధించిన పలు సమస్యలను వాకర్స్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే ఇటీవల నెల్లూరు నగరంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపైనా వాకర్స్‌తో మంత్రి నారాయణ చర్చించారు. కార్యక్రమంలో వాకర్స్ అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు.




