Nellore: 21వ డివిజన్‌లో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి రోడ్‌షో!

Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి రోడ్‌షో. మేయర్ అభ్యర్థి రూప్‌కుమార్‌ యాదవ్‌, జనసేన అభ్యర్థి విజయలక్ష్మికి మద్దతుగా ప్రచారం.

A Praveen, Nellore
Published on: 27 Oct 2026 11:29 PM IST
Nellore
X

Nellore: 21వ డివిజన్‌లో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి రోడ్‌షో!

నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో పాటు జనసేన అభ్యర్థుల గెలుపును కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచార బాధ్యతలను స్వయంగా భుజానికెత్తుకున్నారు.

ఇందులో భాగంగా నెల్లూరు నగరంలోని 21వ డివిజన్‌లో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. జనసేన అభ్యర్థి విజయలక్ష్మిని గాజు గ్లాసు గుర్తుపై, కూటమి మేయర్‌ అభ్యర్థి రూప్‌కుమార్‌ యాదవ్‌ను సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నేతలు ఓటర్లను కోరారు.

కూటమి అభ్యర్థులందరి విజయమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, మిత్రపక్షాల మధ్య సమన్వయంతో ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నామని నేతలు స్పష్టం చేశారు. కూటమి ఐక్యతను చాటుతూ జనసేన అభ్యర్థుల విజయానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి వివరించారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.

మహిళల హారతులు, కార్యకర్తల నినాదాలు, నాయకుల ప్రచారంతో 21వ డివిజన్‌లో ఎన్నికల సందడి నెలకొంది.

A Praveen, Nellore

A Praveen, Nellore