Nellore: కామ్రేడ్ పముజుల దశరథరామయ్యకు ఎమ్మెల్యే కోటంరెడ్డి నివాళి

Nellore: నెల్లూరు రూరల్ సీనియర్ కమ్యూనిస్టు నేత పముజుల దశరథరామయ్య మృతికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 July 2026 3:43 PM IST
Nellore
X

Nellore: కామ్రేడ్ పముజుల దశరథరామయ్యకు ఎమ్మెల్యే కోటంరెడ్డి నివాళి

నెల్లూరు: కామ్రేడ్ పముజుల దశరథరామయ్య గారికి ఘన నివాళులు అర్పించిన గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నాయకులు, కామ్రేడ్ పముజుల దశరథరామయ్య గారు (94) పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాడి, ప్రజా ఉద్యమాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడంతో పాటు, పేద ప్రజల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు పముజుల దశరథరామయ్య గారు. ప్రజా ఉద్యమాల్లో అగ్రభాగాన నిలిచి, ఎంతోమంది పోరాట యోధులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు, పేద ప్రజల పోరాటాలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story