Nellore: శరన్నవరాత్రుల ఏర్పాట్లపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష
Nellore: నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ శరన్నవరాత్రుల ఏర్పాట్లపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్షించారు. సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తామన్నారు.
Nellore: శరన్నవరాత్రుల ఏర్పాట్లపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష
నెల్లూరు: శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లపై ఆర్.డి.ఓ., మరియు వివిధ శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, VIP లకు మధ్యాహ్నం 12.30 గంటల నుండి 1.30 గంటల వరకు అలాగే సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చునని తెలిపారు ... దాతలు వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలకాలని సూచించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
రాజకీయ జెండా, అజెండాలు తనకు ఎన్నికలవేళ మాత్రమే ఉంటాయని, అందుకే రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకొని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
తాను కూడా సాధారణ భక్తుడిలాగానే దసరా రోజు క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకుంటానని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.... తనకు అమ్మవారు అంటే ఎంతో భక్తి అని, తాను కూడా ఎమ్మెల్యే అనే హోదాని బయట వదిలేసి, అమ్మవారి దేవస్థానంలోకి వస్తానని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.




