Nellore: కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, వైయస్సార్‌‌సీపీ నేతలు

Nellore: నెల్లూరు కలెక్టర్‌ను వైయస్సార్‌సీపీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ కుట్రలను ఎండగట్టారు.

V. Narasimhulu, Nellore
Published on: 3 Oct 2026 4:36 PM IST
Nellore
X

Nellore: కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, వైయస్సార్‌‌సీపీ నేతలు

నెల్లూరు: నెల్లూరు కలెక్టరేట్ లో.. వైఎస్ఆర్సిపి నేతలతో కలిసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ని కలిశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ కుట్రలు, దౌర్జన్యాలు తెరతీసె అవకాశం ఉందని .. అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్ ని కోరారు.

సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ....

స్థానిక సంస్థల ఎన్నికల్లో.. అధికార పార్టీ ఎలాగైనా గెలవాలని.. కుతంత్రాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ఇస్టారీతిలో ఓటర్ లిస్ట్ లను.. రూపొందించి.. కొంతమంది ఓటర్లను జాబితా నుంచి మాయం చేయడం చేస్తున్నారని.. అధికార పార్టీ నేతలపై ధ్వజమెత్తారు. పోలీసు, రెవిన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని.. ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావన్నారు.

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ లేని.. పరిస్థితులను కూటమినేతలు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. మరొపక్క ప్రతిపక్ష పార్టీ నేతలను అక్రమ అరెస్టులు చేయడం, నిర్బంధించడం లాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు. ఇప్పటికే కూటమి పార్టీలు ప్రజాధరణ కోల్పోయాయి కాబట్టి.. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగితే తాము గెలవలేమని భావించి అధికార ఈ విధమైన అక్రమాలకు తెరతీసేందుకు ప్రయత్నిస్తుందన్నారు.

ఈరోజు ఈ విషయాలన్నిటిపై జిల్లా కలెక్టర్ ని కలిసి.. మాట్లాడి.. అన్ని విషయాలను కలెక్టర్ కి వివరించడం జరిగిందన్నారు. అధికార పార్టీ దుర్మార్గాలను అడ్డుకోవాలని కలెక్టర్ ని కోరామని తెలిపారు.

ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై జరుగుతున్న అరెస్టులు.. మాపై అధికార పార్టీ తీవ్ర అభ్యంతరకర భాషను.. ప్రయోగిస్తూ దూషిస్తున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇదే వ్యవహార శైలిలో రేపటి.. పోలింగ్ రోజున కూడా అధికార పార్టీ.. వ్యవహరించే అవకాశం ఉందన్నారు. ఈరోజు అధికార పార్టీ పెంచి పోషిస్తున్న విష సంస్కృతిని నెల్లూరులో తీసుకువస్తే.. అధికార పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అధికార పార్టీ దుర్మార్గాన్ని, ఆగడాలని ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మరింత దూకుడుగా ముందుకెళుతుందన్నారు.

నెల్లూరులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలే తప్ప.. దుర్మార్గాలు, దౌర్జన్యాలు బెదిరింపులతో.. గెలవాలని కూటమినేతలు చేస్తున్న.. పన్నాగాలు ఫలించవన్నారు. ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్న. కేవలం రెండేళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని.. ఈ రెండేళ్లలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టాలని చూస్తే.. సహించేదిలేదన్నారు. తర్వాత రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని.. మా ప్రభుత్వంలో మీరు ఈ ఐదేళ్లలో.. చేసిన అవినీతి అక్రమాలకు.. అన్ని బయటకు తీసి.. కూటమినేతలను న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore