Nellore: సంకటహర చతుర్థి వేళ మూలపేట విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!

Nellore: నెల్లూరు నగరం మూలపేటలోని శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

A Praveen, Nellore
Published on: 27 Nov 2026 2:30 PM IST
Nellore
X

Nellore: సంకటహర చతుర్థి వేళ మూలపేట విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!

నెల్లూరు: నగరం మూలపేటలో వెలసిన శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు హరి, లహరి, ప్రవీణ్‌తో పాటు రోహిత్, మనోజ్, మాధవ, అనిల్ పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరి మాట్లాడుతూ.. నెలలో ఒకసారి వచ్చే గణనాథునికి అత్యంత ప్రీతిపాత్రమైన సంకటహర చతుర్థి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. భక్తులందరూ స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore