Nellore: నెల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు!
Nellore: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 27వ డివిజన్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు.
Nellore: నెల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు!
Nellore: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం 27వ డివిజన్లో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు తనయులు డాక్టర్ అర్జున్ రెడ్డి, కోడలు ఐషిత రెడ్డి కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని అన్ని డివిజన్లలో పోలింగ్ ఉత్సాహంగా సాగుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారని, ఓటు వేసేందుకు బారులు తీరుతున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఆసక్తి పెరిగిందని, ఇది ప్రజాస్వామ్యానికి శుభపరిణామమని చెప్పారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో సానుకూలత పెరిగిందని, ఆ స్పందనే పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నారని, ఈసారి గతంతో పోలిస్తే పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. ఈ ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికి మద్దతుగా నిలుస్తున్నారని, ఫలితంగా స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తెలుగుదేశం కూటమి మరోసారి విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
నెల్లూరు నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని వీపీఆర్ దంపతులు పేర్కొన్నారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడి పరిష్కారానికి కృషి చేసే బాధ్యత తమదన్నారు. తాము కుటుంబ సభ్యులమంతా 27వ డివిజన్లో ఓటు హక్కు వినియోగించుకున్నామని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలింగ్లో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఓటు ద్వారా అభివృద్ధికి, సంక్షేమానికి మద్దతు తెలపాలని కోరారు.




