Nellore: జిల్లా ప్రజలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు!
Nellore: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని పేర్కొంటూ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Nellore: జిల్లా ప్రజలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు!
నెల్లూరు: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ప్రజలకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు.
రావణుడిపై విజయం సాధించి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని, ఆ సంప్రదాయమే దీపావళి పండుగ వెనుక ఉన్న గొప్ప సందేశమని తెలిపారు. దీపావళి వెలుగులు ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు.
జిల్లాలోని ప్రతి ఇంటా దీపాల కాంతులతో పాటు సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. నెల్లూరు జిల్లా, పార్లమెంటు నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.




